రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం

సోనియా గాంధీగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.

By Srikanth Gundamalla  Published on  4 April 2024 7:28 AM GMT
sonia gandhi, takes oath,  rajya sabha mp ,

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్ అగ్రనాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాను లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే.. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాంతో.. ఆమె తొలిసారిగా పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. గురువారం సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌.. గురువారం ఉదయం సోనియా గాంధీగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

రాజస్థాన్‌ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ విషయం ముందే అందరికీ తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా గాంధీ పోటీ చేశారు. సరిగ్గా ఏప్రిల్ 3వ తేదీతో మన్మోహన్ సింగ్ పదవీ కాలం ముగిసింది. దాంతో రాజస్థాన్‌ నుంచి సోనియాగాంధీ రాజ్యసభకు పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక తాజాగా సోనియాగాంధీ గురువారం ఉదయం రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. సోనియగాంధీతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది సభ్యులు గురువారమే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా ఉన్నారు. అశ్వినీ వైష్ణవ్‌ ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యారు.


Next Story