సోనియా గాంధీ భావోద్వేగ లేఖ
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు గురువారం భావోద్వేగ లేఖను రాశారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:07 PM ISTసోనియా గాంధీ భావోద్వేగ లేఖ
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు గురువారం భావోద్వేగ లేఖను రాశారు. సోనియాగాంధీ బుధవారం రాజ్యసభకు నామినేషన్ విషయం తెలిసింఏద. 1999 నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ వస్తోన్న సోనియాగాంధీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. దాంతో.. సుదీర్ఘకాలం నుంచి ఆమె పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇంతకాలం తనని ఆదరించి లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తూ వచ్చిన రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. సోనియా గాంధీ అనారోగ్య సమస్యల కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగడం లేదు. ఈ విషయాన్నే బహిరంగ లేఖలో రాయ్‌బరేలీ ప్రజలకు ఆమె వివరించారు. కాగా.. రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి సోనియాగాందీ 2004 నుంచి వరుసగా ప్రాతినిథ్యం వహించారు. తన తర్వాత రాయ్‌బరేలీ నుంచి తమ కుటుంబం నుంచే ఒకరు పోటీ చేస్తారని సోనియాగాంధీ హింట్ ఇచ్చారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరే అంటూ రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశించి లేఖలో రాశారు. ఇది గర్వంగా చెబుతున్నానని అన్నారు. రాయ్‌బరేలీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు తన వంతు కృషి కొనసాగుతుందని సోనియాగాంధీ లేఖలో పేర్కొన్నారు. తన హృదయం, ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందన్నారు. గతంలో మాదిరే ఇక ముందు కూడా తనకు, తన కుటుంబానికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు సోనియా లేఖ రాశారు.
కాగా.. ప్రియాంక గాంధీ లోక్‌సభ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి తప్పుకోవడంతో అక్కడి నుంచే ప్రియాంకను బరిలోకి దించే అవకాశాలు కల్పిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఇక్కడ మంచి పట్టు ఉండటంతో ప్రియాంకను పోటీ చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ కచ్చింగా గెలిచే స్థానం కాబట్టి అక్కడి నుంచే ప్రియాంకను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి.