ఇవాళ దేశ వ్యాప్తంగా వైద్యసేవలు బంద్

ఇవాళ పలు రకాల వైద్య సేవలను నిలివేస్తున్నట్లు ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2024 7:45 AM IST
medical services,  india, closed, today,

ఇవాళ దేశ వ్యాప్తంగా వైద్యసేవలు బంద్ 

దేశవ్యాప్తంగా ఇవాళ పలు రకాల వైద్య సేవలను నిలివేస్తున్నట్లు ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచారం చేయడంపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పలు రకాల వైద్యాలను సోమవారం నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

ఈ మేరకు ఫోర్డా కేంద్రం ముందు పలు డిమాండ్లను ఉంచింది. వైద్యుల భద్రత కోసం చర్యల తీసుకోవాలని కోరింది. పలు రకాల వైద్య సేవలను నిలిపివేతను తేలికగా తీసుకోవద్దని కేంద్రానికి ఫోర్డా సూచించింది. ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నది. ఆర్‌జీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలనీ. నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలిపింది. అలాగా బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అన్ని ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం కేంద్రం ప్రొటోకాల్ విడుదల చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది.

అసలేం జరిగిందంటే..

కోల్‌కతాలో ఆర్‌జీ కర్‌ కాలేజీలో 28 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌ హత్యకు గురైంది. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించారు వైద్యులు. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్‌ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్‌ రూమ్‌లో దొరికింది. ఇయర్‌ ఫోన్‌ నిందితుడిని పట్టించిందిన పోలసీఉలు వెల్లడించారు. ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్‌ డివైజ్‌ అతని మెడలో ఉంది. 40 నిముషాల అనంతరం బయటకు వచ్చేటప్పుడు అది అతడి మెడలో లేదు. పెనుగులాట తర్వాత ట్రెయినీ డాక్టర్‌ను గొంతు పిసికి చంపినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. సంజయ్‌ రాయ్‌ పోలీస్‌ పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.

Next Story