వాటే జాబ్.. నిద్రపోతే రూ.10లక్షలు.. ఇలా అప్లై చేయండి
Sleep internship is back bengaluru startup pays RS 10 lakhs for 9 hours of sleep.కొన్ని కొన్ని సార్లు చదువుతుంటే..
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2021 3:50 PM ISTకొన్ని కొన్ని సార్లు చదువుతుంటే.. ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా అని అనిపిస్తుంది. నిద్రపోతే రూ.10లక్షలు ఇస్తారట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 100 రోజుల పాటు రోజూ 9 గంటలు హాయిగా నిద్రపోతే 10 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ దీన్ని అందిస్తోంది. ఇది మ్యాట్రెసెస్ తయారు చేసే స్టార్టఫ్ సంస్థ. వినియోగదారులకు కావాల్సిన రీతిలో పరుపులు తయారు చేసేందుకు స్లీప్ ప్యాట్రన్స్‌పై అధ్యయనం చేయడంలో భాగంగా 2019లో స్లీప్ ఇంటర్న్ షిప్ మొదలు పెట్టింది.
దీనికి ఎంపికైన వారంతా 100 రోజుల పాటు ప్రతి రోజు తొమ్మిది గంటలు పడుకోవాలి. గెలిచిన వారికి రూ.10లక్షలు ఇస్తారు. గత సీజన్ 2020లో ఒక బ్యాచ్ విజయవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఇంటర్న్ షిప్ రెండో సీజన్ 2021-22 బ్యాచ్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఏడాది బ్యాచ్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని వడపోసి షార్ట్ లిస్ట్ చేసి కొందర్ని స్లీప్ ఇంటర్న్స్‌గా ఎంపిక చేస్తారు. ఇంటర్న్‌షిప్ సక్సెస్ పుల్ గా పూర్తి చేసిన వారిని స్లీప్ ఛాంపియన్‌గా గుర్తించి రూ.10 లక్షలు అందిస్తారు. అలానే స్లీప్ ఇంటర్న్‌గా ఎంపికైన ప్రతీ ఒక్కరికి రూ.1,00,000 చొప్పున చెల్లిస్తారు. అంటే స్లీప్ ఇంటర్న్‌గా ఎంపికైతే చాలు రూ. 1 లక్ష రూపాయాలు గ్యారెంటీ.
ఏదైన డిగ్రీ పాస్ అయినవారు ఎవరైనా దరఖాస్తులు పంపొచ్చు. కానీ.. ఓ కండిషన్ ఉంది. అది ఏంటంటే..? కేవలం 10 నుంచి 20 నిమిషాల్లో నిద్రపోగలగాలి. అర్థరాత్రి వరకు మెళకువగా ఉండే అలవాటు ఉండకూడదు. ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగం కావాలనుకుంటే https://wakefit.co/sleepintern/ను సందర్శించండి. ఒకటికి రెండు సార్లు పూర్తి వివరాలు.. టర్మ్స్ అండ్ కండీషన్స్ చదివి కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోండి.