లోయలో పడ్డ బస్సు, ఆరుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 6:59 AM ISTలోయలో పడ్డ బస్సు, ఆరుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా కలాధుంగి ప్రాంతంలో చోటుచేసుకుంది. హర్యానా నుంచి బస్సు ఆదివారం రాత్రి హిసార్ జిల్లాకు వెళ్తుంది. ప్రమాదానికి గురైన బస్సు పర్యాటకుల బస్సుగా గుర్తించారు పోలీసులు. అయితే.. నైనిటాల్‌ను సందర్శించి వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. దాంతో.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.
కాగా.. బస్సు ప్రమాద సమయంలో 100 మీటర్ల లోతైన లోయలో పడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో పోలీసులతో పాటు.. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కూడా పాల్గొన్నాయి. బస్సు ఎలా అదుపుతప్పి లోయలో పడిపోయిందనే విషయం ఇంకా తెలియలేదు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు హర్యానాకు చెందిన పర్యాటకులుగా పోలీసులు గుర్తించారు.