కాంగ్రెస్‌కు షాక్.. 55 ఏళ్ల బంధాన్ని ముగించిన సీనియర్ నేత

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. పార్టీ కీలక నేత మిలింద్‌ దేవరా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 5:20 AM GMT
congress party, senior leader, milind, resign,

 కాంగ్రెస్‌కు షాక్.. 55 ఏళ్ల బంధాన్ని ముగించిన సీనియర్ నేత

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. పార్టీ కీలక నేత మిలింద్‌ దేవరా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో ఆదివారమే చేరనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల విషయంలో మిలింద్‌ దేవరా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దాంతో.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో ఒకరైన మిలింద్‌ రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా రాజీనామా గురించి మాట్లాడిన మిలింద్‌ దేవరా.. 'రాజకీయ ప్రయానంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్నేళ్లుగా పార్టీ నుంచి మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా' అంటూ మిలింద్‌ దేవరా ఎక్స్‌ వేదిగా పోస్టు పెట్టారు.

కాగా.. మిలింద్‌ దేవరా ముంబై సౌత్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆయన వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. కానీ.. 2014, 2019 ఎన్నికల్లో శివనసేన నేత ప్రమోద్‌ సావంత్‌ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్‌ ముంబై లోక్‌సభ స్థానాన్ని శివసేనకు కేటాయించారు. ఈ విషయంలోనే ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి శివసేన పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.

కాంగ్రెస్‌కు మిలింద్‌ రాజీనామా చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. మిలింద్‌ దేవరా తండ్రి మురళీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని పంచుకున్నారు. మురళీ.. తాను ఎంతో అభిమానంతో మెలిగేవారమని చెప్పారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీల్లో సన్నిహిత మిత్రులు ఉన్నారని తెలిపారు. కానీ.. ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచే ధృడమైన కాంగ్రెస్‌వాది అని చెప్పారు. కానీ.. మిలింద్‌ పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు.

Next Story