ఒడిశా సీఎంకు ఎదురుదెబ్బ.. కాంటాబంజిలో వెనుకంజ
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 7:16 AM GMTఒడిశా సీఎంకు ఎదురుదెబ్బ.. కాంటాబంజిలో వెనుకంజ
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లోక్‌సభ స్థానాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇవాళే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్న మరో రాష్ట్రం ఒడిశాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువుడుతున్నాయి. అక్కడ బీజేపీ, బిజు జనతాదళ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన కౌంటింగ్‌లో వెనుక పడిపోయారు. కాంటాబంజి అసెంబ్లీ నుంచి బరిలో నిలిచిన నవీన్‌పట్నాయక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ ముందంజలో ఉండగా.. నవీన్ పట్నాయ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే.. ఎక్కువగా ఓట్ల తేడా లేకపోయినా.. సీఎంగా ఉన్న నవీన్ పట్నాయ్ ట్రయల్‌లో ఉండటం ఆ పార్టీకి గట్టి షాక్ అనే అంటున్నారు రాజకీయ నిపుణులు.
నవీన్ పట్నాయక్ మరో స్థానం నుంచి కూడా పోటీలో ఉన్నారు. రెండో స్థానమైన హింజిలిలో 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ 74 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేడీ 56 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 14, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.