కాంట్రాక్ట‌ర్‌పై చెత్త వేయించిన ఎమ్మెల్యే

Shivsena MLA Dilip lande put trash waste on contractor.గ‌త కొద్ది రోజులుగా మ‌హారాష్ట్ర‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2021 1:36 PM IST
కాంట్రాక్ట‌ర్‌పై చెత్త వేయించిన ఎమ్మెల్యే

గ‌త కొద్ది రోజులుగా మ‌హారాష్ట్ర‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ముంబై స‌హా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాల‌కు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్ల‌పై మురుగునీరు ప్ర‌వ‌హిస్తోంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు రోడ్డుపై ప్ర‌వ‌హించడంపై చాంద్‌వాలి ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆగ్రహం వ్యక్తంచేశారు. డ్రైనేజీ క్లీన్ చేయలేదని కాంట్రాక్టర్‌పై మండిప‌డ‌డంతో పాటు అత‌డిని మురుగునీటిలో కూర్చోబెట్టి అత‌డిపై చెత్త వేయించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

కాంట్రాక్టర్ గత కొన్ని రోజులుగా డ్రైనేజీలను శుభ్రం చేయడం ఎమ్మెల్యే దిలీప్ లాండే చెప్పారు. దీంతో నీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజుల తరబడి ఫిర్యాదు చేసినా.. స్పందించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో శనివారం చెత్తను తొలగించేందుకు తన కార్యకర్తలతో వెళ్లగా.. కాంట్రాక్టర్ కూడా అక్కడకు వచ్చాడన్నారు. సరిగా పనిచేయకపోతే.. ఏం జరుగుతుందో చూపించడానికి తాను అలా చేయించినట్లు పేర్కొన్నారు. ఓ ప్రజా ప్రతినిధి ఇలా చేయవచ్చా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు వేరే మార్గం లేదని.. ఇలా చేయడం ఏమాత్రం తప్పు కాదంటూ తాను చేసిన ప‌నిని స‌మ‌ర్థించుకున్నారు.

Next Story