కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ప‌ట్టాలు త‌ప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

Several coaches derail as boulders hit Kannur-Bengaluru Express.త‌మిళ‌నాడు రాష్ట్రంలో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2021 6:32 AM GMT
కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ప‌ట్టాలు త‌ప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

త‌మిళ‌నాడు రాష్ట్రంలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలుపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఐదు బోగీలు ప‌ట్టాయి ప‌ట్టాయి. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు ఎవ్వ‌రికి ఏమీ కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరీపీల్చుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ధర్మపురం జిల్లాలోని తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్ర‌యాణిస్తోంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 3.50 గంట‌ల ప్రాంతంలో రైలుపై కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ్డాయి. బండ‌రాళ్లు ప‌డ‌డంతో ఐదు బోగీలు ప‌ట్టాయి త‌ప్పాయి. ఆ స‌మ‌యంలో రైలులో 2,348 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు. స‌మాచారం అందుకున్నవెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ప్ర‌యాణీకులు ఎవ్వ‌రికి ఎమీకాలేద‌ని.. అంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు సౌత్ వెస్ట్ర‌న్ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్‌) తెలిపింది. ప‌ట్టాల‌పై, కొండకు, రైలు మధ్య రాళ్లు ప‌డ‌డంతో వాటిని తొల‌గించేందుకు రైల్వే సిబ్బంది శ్ర‌మిస్తున్నారు. ట్రాక్ పనులు పునరుద్ధరించేందుకు సమయం ప‌ట్టే అవకాశం ఉండటంతో.. ప్రయాణికులను బెంగళూరు తరలించేందుకు 15 బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌యాణీకులకు ఇబ్బంది క‌లుగ‌కుండా అల్పాహారం, తాగు నీరుని అందించారు.

Next Story