21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. సెకండ్‌ లిస్టు విడుదల

గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి
Published on : 22 April 2025 7:23 AM IST

Second merit list, Gramin Dak Sevak posts, Postal

21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. సెకండ్‌ లిస్టు విడుదల

గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లోని బ్రాంచ్‌ పోస్ట్‌ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల రెండో షార్ట్‌ లిస్ట్‌ను పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. మార్చిలో మొదటి జాబితా విడుదల చేయగా.. ఇప్పుడు రెండో జాబితాను ప్రకటించింది. https://indiapostgdsonline.gov.in/ లో ఎంపికైన అభ్యర్థుల రెండో లిస్ట్‌ ఉంటుంది.

21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1215, తెలంగాణలో 519 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. తాజాగా సెకండ్‌ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుండి 702 మంది, తెలంగాణ నుండి 169 మంది చొప్పున ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు మే 6 లోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవ్వాలి. ఈ పోస్టులకు ఎంపికన వారు బ్రాంచ్‌ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌గా సేవలు అందిస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను తీశారు. కంప్యూటర్‌ జనరేటర్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌ ప్రకారం షార్ట్‌ లిస్ట్‌ రూపొందించారు.

Next Story