తెలుగు రాష్ట్రాల నుంచి డిసెంబర్, జనవరి నెలల్లో శబరిమలకు వెళ్లే యాత్రికులకు దక్షిణ మద్య రైల్వే శుభవార్త చెప్పింది. 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్, హైదరాబాద్, నర్సాపూర్ నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
రైళ్ల సమాచారం ఇదే..
హైదరాబాద్-కొల్లాం: డిసెంబరు 5, 12, 19, 26, మళ్లీ జనవరి 2, 9, 16
కొల్లాం-హైదరాబాద్ : డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17
నర్సాపూర్-కొట్టాయం: డిసెంబరు 2, 9, 16, 30, జనవరి 6, 13
కొట్టాయం-నర్సాపూర్ : డిసెంబరు 3, 10, 17, 24, జనవరి 7, 14
సికింద్రాబాద్-కొట్టాయం: డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8
కొట్టాయం-సికింద్రాబాద్ : డిసెంబరు 4, 11, 18, 25, మళ్లీ జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు నడవనున్నాయి.
ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ శుక్రవారం రామగుండం- సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గాన్ని సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్‌కుమార్ గుప్తాతో కలిసి తనిఖీ చేశారు. జమ్మికుంటలో స్టేషన్‌లో 20 కిలోవాట్ల సోలార్ ప్లాంటును ప్రారంభించారు. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి రైల్వేస్టేషన్ వరకు రైల్వే ట్రాక్ వేగ సామర్థాన్ని పరీక్షించారు.