తెలుగు రాష్ట్రాల రైల్వే ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌.. మ‌రో 22 ప్ర‌త్యేక రైళ్లు

SCR to restore 22 more special trains from april 1.రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది రైల్వే శాఖ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 8:58 AM IST
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌.. మ‌రో 22 ప్ర‌త్యేక రైళ్లు

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది రైల్వే శాఖ. కోవిడ్‌ కారణంగా రైళ్లన్ని రద్దు కాగా, ఇటీవల కాలం నుంచి కొన్ని కొన్ని రైళ్లను పట్టాలెక్కించారు. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని చర్యలు చేపడుతూ రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. తాజాగా 22 రైళ్లను పునరుద్దరించనున్నారు రైల్వే అధికారులు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ 22 ప్రత్యేక రైళ్లు పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల పేరిట దశల వారీగా రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది.

కోవిడ్‌కు ముందు జోన్‌ నుంచి 291 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు కొనసాగేవి. వీటిలో ప్రత్యేక రైళ్ల పేరిట ఇప్పటి వరకు 170 రైళ్లను పునరుద్దరించగా, ఏప్రిల్‌ 1 నుంచి 22 రైళ్లను పునః ప్రారంభించనున్నారు. వీటిలో గుంటూరు-కాచిగూడ, సికింద్రాబాద్‌-విశాఖ, ఆదిలాబాద్‌-నాందేడ్‌, సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌, జియవాడ-షిర్డీ, నాందేడ్‌-శంట్రగచ్చి, నాందేడ్‌-ఔరంగాబాద్‌, నాందేడ్‌-శ్రీగంగానగర్‌, సికింద్రాబాద్‌, విశాఖ మధ్య నడిచే గరీబ్‌ రథ్‌ రైళ్లు కూడా ఉన్నాయి. అలాగే ఔరంగాబాద్‌-రేణిగుంట, నాందేడ్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌, సికింద్రాబాద్‌-విజయవాడ, మధ్య ఈ 22 రైళ్లు మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెట్టనున్నాయి.


Next Story