ఖైదీలకు భారత సుప్రీంకోర్టు శుభవార్త..!

SC nod for e-transfer of orders to jails for quick prisoner release.ఖైదీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.

By అంజి  Published on  24 Sept 2021 8:08 AM IST
ఖైదీలకు భారత సుప్రీంకోర్టు శుభవార్త..!

ఖైదీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. బెయిల్ మంజూరు అయిన వెంటనే విడుదలయ్యేలా ఫాస్టర్ విధానం అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఖైదీలను విడుదల చేసేలా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టులు బెయిల్ మంజూరు చేసినా.. సాంకేతిక కారణాలతో ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుమోటోగా కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు తాజా ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు ఉత్తర్వులు సంబంధిత జైళ్లకు వెనువెంటనే చేరేందుకు ఈ ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని, అన్ని జైళ్లలో ఇంటర్‌నెట్‌ సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎస్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతవరకూ నోడల్ ఏజెన్సీ ద్వారా ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ కొత్త విధానంతో ఇకపై బెయిల్‌ ఉత్తర్వులు మెయిల్‌ ద్వారా సంబంధిత జైళ్లకు చేరనున్నాయి.

Next Story