దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తుంది. ఈక్రమంలోనే కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్టానికి దిగి వచ్చాయి. సెకండ్ వేవ్ తగ్గిపోతుందని సంతోషించే లోపే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది ఎస్‌బీఐ తాజా సర్వే. వచ్చే నెలలోనే (ఆగస్ట్) కరోనా థర్డ్‌వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో కరోనా కేసుల నమోదు శిఖరాన్ని తాకుతుందని కూడా అంచనా వేసింది. 'కోవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్' పేరుతో ఎస్‌బీఐ ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది.
సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చు. అయితే ఆగస్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచనా వేసింది.
ఎస్‌బీఐ రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు..
- కరోనా సెకండ్ వేవ్‌తో పోలిచ్చే థర్డ్ వేవ్ లో సగటు ఉదృత కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
- ఆగస్ట్ రెండో వారంలో కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమై నెల రోజుల లోపే పీక్ స్టేజీకి వెళ్లే ఛాన్స్ ఉంది.
- ఇక దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తున్నారు. రెండో డోసు వేసుకున్న వారు 4.60శాతం కాగా.. తొలి డోసు వేసుకున్న వారు 20.8 శాతం.