ప్రముఖ టీవీ ఛానల్ లోకి కత్తితో వెళ్లి.. సీసీటీవీ ఫుటేజీ చూస్తే

Satyam TV office attacked by unkown person.చెన్నైలోని ప్రముఖ శాటిలైట్ ఛానల్ అయిన సత్యం టీవీ ప్రధాన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 11:07 AM GMT
ప్రముఖ టీవీ ఛానల్ లోకి కత్తితో వెళ్లి.. సీసీటీవీ ఫుటేజీ చూస్తే

చెన్నైలోని ప్రముఖ శాటిలైట్ ఛానల్ అయిన సత్యం టీవీ ప్రధాన కార్యాలయంలోకి కత్తిని తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మంగళవారం నాడు హత్యా యత్నం చేయడమే కాకుండా ఆ వ్యక్తి టీవీ ఛానల్ ఆస్తులను కూడా ధ్వంసం చేశాడు. ఛానెల్ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో ఆ వ్యక్తి కత్తి, డాలు పట్టుకుని ఆస్తులను ధ్వంసం చేసినట్లు కనిపించింది. "అతను కారు పార్కింగ్ ప్రాంతం ద్వారా కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అతను గిటార్ బ్యాగ్‌లో ఆయుధాలను తీసుకెళ్లాడు" అని ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజాక్ లివింగ్‌స్టోన్ చెప్పారు. లివింగ్‌స్టోన్ ను లక్ష్యంగా చేసుకుని టీవీ ఛానల్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అరెస్టయిన వ్యక్తి లివింగ్‌స్టోన్ కోసం అడుగుతూనే ఉన్నాడని మరియు నేను గదిలో ఉన్నానని అతను అనుకున్నాడని లివింగ్‌స్టోన్ చెప్పారు. అతడు ఎవరో, ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదన్నారు. తాము ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదని అన్నారు.

అతడు కత్తి, డాలు పట్టుకుని కార్యాలయంలోని అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. సిబ్బందిని బూతులు తిడుతూ నానా హంగామా చేశాడు. ఈ సంఘటన చెన్నెలో చోటుచేసుకుంది. చెన్నెలోని రోయపురం కామరాజరర్‌ రోడ్డులో సత్యం టీవీ ఛానల్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తి, డాలు తీసుకొని కార్యాలయంలోకి ప్రవేశించాడు. రిసెప్షన్‌లో కనిపించిన ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. ఒకటో అంతస్తులోని అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి బీభత్సం సృష్టించాడు. అతడిని అతికష్టం మీద సెక్యూరిటీ పట్టుకున్నారు. దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్‌గా గుర్తించారు. రోయపురం పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కార్యాలయంపై దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెన్నె ప్రెస్‌ క్లబ్‌ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్‌ డిమాండ్‌ చేశారు.

Next Story
Share it