తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇటీవల శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆమె ఆస్పత్రిలో చేర్చారు. బౌరింగ్ ఆస్పత్రిలో రెండు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. ఆ ఆస్పత్రిలో సీటీ స్కార్ లేకపోవడంతో.. అక్కడి నుంచి ఆమెను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది.
దీంతో పాటు రక్తపోటు, మధుమేహం సమస్యలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఊపిరితిత్తులు దెబ్బతినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జయలలిత మృతి చెందిన తరువాత అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టైన విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆమె ఈ నెల 27న విడుదల కానున్నట్లు శశికళ తరుపు న్యాయవాది రాజా సెతురపాండియన్ ఇటీవల వెల్లడించారు.
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10కోట్లు జరిమానా చెల్లించారు. మరికొద్ది రోజుల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో చక్రం తిప్పాలని బావించారు శశికళ. ఈ తరుణంలో శశికళ తీవ్ర అస్వస్థతకు గురికావడం, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.