బెంగళూరు: శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఆమె చెల్లించాల్సిన రూ.10 కోట్ల పది లక్షల జరిమానాను కోర్టుకు చెల్లించారు. రశీదులను పరప్పర అగ్రహార జైలుకు చిన్నమ్మ న్యాయవాదులు పంపించినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ జనవరిలో జైలు నుంచి విడుదల కాబోతున్నారన్న విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె విడుదల అవుతారని సమాచారం. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న చిన్నమ్మ .. విడుదలవుతారన్న సమాచారంతో అన్నాడీఎంకేలో చర్చ తప్పలేదు. అదే సమయంలో చిన్నమ్మ విడుదలకు అడ్డుకునే ప్రయత్నాలు సైతం సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఆమె తరపున న్యాయవాది రాజా చెందూర్ పాండియన్‌ అయితే చిన్నమ్మ విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆమె జైలు నుంచి బయటకు వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


ఆదివారం బెంగళూరుకు వెళ్లిన రాజా చెందూర్‌ పాండియన్‌ శశికళకు కోర్టు విధించిన జరిమానా చెల్లింపు పనిలో ఉన్నారు. బెంగళూరులోని న్యాయవాది ముత్తుకుమార్‌తో కలిసి రూ.10 కోట్ల 10 లక్షలను మంగళవారం సంబంధిత కోర్టులో చెల్లించారు. డీడీ రూపంలో న్యాయమూర్తి అందుకున్నారు. రశీదు బుధవారం ఉదయాన్నే ఆ కోర్టు నుంచి చిన్నమ్మ న్యాయవాదులు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని ప్రక్రియలు సజావుగానే సాగుతున్నాయని, చిన్నమ్మ ఒకటి, రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయని న్యాయవాది రాజాచెందూరర్‌ పాండియన్‌ అన్నారు. గతంలో అనుభవించిన జైలు జీవితం మేరకు ఆమె ముందస్తుగానే విడుదలయ్యే అవకాశాలున్నాయని ధీనా వ్యక్తం చేశారు.

సుభాష్

.

Next Story