1990-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆయనను నియమించింది. మూడు సంవత్సరాల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న మల్హోత్రా ఫైనాన్స్, టాక్సేషన్, పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్‌తో సహా కీలక రంగాలలో 33 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మల్హోత్రా అమెరికా లోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం కూడా డిసెంబర్ 10తో ముగియనుంది.