ఎన్నికల ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది.
By అంజి Published on 23 Aug 2023 10:08 AM ISTఎన్నికల ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం "ఎన్నికల ప్రచారకర్త"గా నియమించనుంది. బుధవారం ఢిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో సచిన్ టెండూల్కర్, పోల్ ప్యానెల్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా టెండూల్కర్ ఓటరుపై అవగాహన కల్పించనున్నారు. "ఈ సహకారం రాబోయే ఎన్నికలలో ముఖ్యంగా 2024 సాధారణ ఎన్నికల్లో (లోక్‌సభకు) ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి యువతతో టెండూల్కర్ యొక్క అసమానమైన ప్రభావాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు సూచిస్తుంది" అని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.
సచిన్‌తో భాగస్వామ్యం ద్వారా ఈసీ పట్టణ, యువత ఓటింగ్ పట్ల ఉదాసీనత యొక్క సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఓటర్లను ప్రేరేపించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాత భారతీయులను తన "ఎన్నికల ప్రచారకర్తలుగా"గా ఈసీ నియమించకుంటూ ఉంటుంది. గత సంవత్సరం ఎన్నికల కమిషన్ నటుడు పంకజ్ త్రిపాఠిని ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకుంది. అంతకుముందు.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంఎస్ ధోని, అమీర్ ఖాన్, మేరీ కోమ్ వంటి దిగ్గజాలు ఈసీ ఎన్నికల ప్రచారకర్తలుగా ఉన్నారు.