శాస‌న‌మండ‌లిలో ర‌భ‌స‌.. డిప్యూటీ ఛైర్మన్‌ను కుర్చీలోంచి లాగేసి తీసుకెళ్లిన సభ్యులు

Ruckus in Karnataka Assembly as Deputy Speaker manhandled. కర్ణాటక శాసనమండలి సమావేశం రసాభాసగా మారింది.

By Medi Samrat  Published on  15 Dec 2020 9:00 AM GMT
శాస‌న‌మండ‌లిలో ర‌భ‌స‌.. డిప్యూటీ ఛైర్మన్‌ను కుర్చీలోంచి లాగేసి తీసుకెళ్లిన సభ్యులు

కర్ణాటక శాసనమండలి సమావేశం రసాభాసగా మారింది. శాసన మండలిలోనే సభ్యులు బాహాబాహీకి దిగారు. అసలు శాసన మండలిలో ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఐదురోజుల వాయిదా అనంత‌రం శాస‌న‌మండ‌లి నేడే తిరిగి ప్రారంభమైంది. మండ‌లి ప్రారంభం కాగానే బీజేపీ, జేడీఎస్‌లు కలిసి ఒకరిని ఛైర్మన్ స్థానంలో అక్రమంగా కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు మండలి డిప్యూటీ చైర్మన్‌ను కుర్చీ నుంచి లాక్కెళ్లారు. ఆయనకు చైర్‌లో ఉండే అర్హత లేదంటూ మూకుమ్మడిగా కిందకు దింపారు. దీంతో మార్షల్స్‌ రంగంలోకి దిగారు. గోవధ నిషేధ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా.. ఈఘ‌ట‌న‌పై బీజేపీ ఎమ్మెల్సీ స్పందిస్తూ.. కొంద మంది స‌భ్యులు గుండాల్లా వ్య‌వ‌రించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మండలి వైస్ ఛైర్మన్‌ను కుర్చీలో నుంచి లాగేశారన్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల చాలా సిగ్గుప‌డుతున్నామ‌ని తెలిపారు.




Next Story