'కనీసం ముగ్గురిని కనండి'.. హిందూ జనాభాపై మోహన్ భాగవత్ హెచ్చరిక

దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు.

By -  అంజి
Published on : 18 Feb 2026 7:07 AM IST

Mohan Bhagwat Lucknow speech, RSS Hindu population concerns, 3 children remark, Illegal infiltrators deport, Religious conversion RSS

'కనీసం ముగ్గురిని కనండి'.. హిందూ జనాభాపై మోహన్ భాగవత్ హెచ్చరిక

దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. హిందువులను శక్తిమంతం చేయాలని, ఇప్పుడు ఎలాం ఎలాంటి ముప్పు లేదు. కానీ అప్రమత్తత అవసరం అని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చొరబాటుదారులను గుర్తించి పంపివేయాలని, ఉపాధి కల్పించకూడదని అన్నారు.

మంగళవారం లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ, హిందూ జనాభా పోకడలు మరియు సమాజంపై వాటి దీర్ఘకాలిక ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సగటు సంతానోత్పత్తి రేటు మూడు కంటే తక్కువగా ఉన్న సమాజాలు భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రీయ అభిప్రాయాలు చెబుతున్నాయని భాగవత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనే అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు.

కొత్తగా పెళ్లయిన జంటలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. వివాహం అనేది కేవలం వ్యక్తిగత కోరికల నెరవేర్పు కోసం మాత్రమే కాదని, సృష్టిని ముందుకు తీసుకెళ్లడమే దాని ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని "గుర్తించి, తొలగించి, బహిష్కరించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధి కల్పించకూడదని సూచించారు.

ప్రలోభాలకు గురిచేసి లేదా బలవంతంగా చేసే మత మార్పిడిలను అరికట్టాలని భాగవత్ అన్నారు. హిందూ ధర్మం నుండి వెళ్లిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను (ఘర్ వాపసీ) వేగవంతం చేయాలని, వారి సంక్షేమాన్ని చూడాలని చెప్పారు. సమాజంలో సామరస్యం లేకపోవడం వల్ల వివక్ష పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. మనమందరం ఒకే దేశానికి, ఒకే మాతృభూమికి చెందిన వారమని గుర్తుచేశారు. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, భిన్నాభిప్రాయాలు ఉన్నవారిని శత్రువులుగా చూడకూడదని హితవు పలికారు. మహిళలను బలహీనులుగా చూడకూడదని, వారు గృహానికి పునాది వంటి వారని అభివర్ణించారు. మహిళలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వాలని, భారతీయ సంప్రదాయం వారి బాహ్య రూపాన్ని కాకుండా వారిలోని పోషించే గుణాన్ని గౌరవిస్తుందని పేర్కొన్నారు.

Next Story