పీఎం-కిసాన్‌.. రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ

Rs 1.15 lakh cr transferred to 10.75 cr farmers under PM KISAN scheme.పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.15 లక్షల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 9:22 AM IST
పీఎం-కిసాన్‌.. రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ

పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్కీమ్‌ వల్ల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం కలిగిందని తెలిపింది. అయితే అర్హత కలిగిన రైతులందరినీ ఈ పథకంలో చేర్చాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర సర్కార్‌ సూచించింది. పీఎం-కిసాన్‌ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ వివరాలను వెల్లడించారు.

2019లో పీఎం- కిసాన్‌ పథకం ప్రారంభం:

రైతులకు మేలు జరిగేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే మూడు దఫాల్లో జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా 10.75 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగగా, ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నరేంద్ర సింగ్‌ థోమర్‌ తెలిపారు. దాదాపు 14.5 కోట్ల మంది రైతులకు పీఎం-కిసాన్‌ ద్వారా ప్రయోజనం కల్పించాలనే లక్ష్యంగా ఉన్నామని, మరింత మంది లబ్దిదారులను చేర్చేందుకు ప్రయత్నాలుచే చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

కాగా, ఈ పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులను చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చాలని కేంద్రం సూచించింది. ఈ పథకం కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిందని, అందుచేత ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది.


Next Story