సిగ్నల్‌కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం.. షాక్‌ ఇచ్చిన ప్రయాణికులు

రైళ్లలో అప్పుడప్పుడు దోపిడి సంఘటనలు జరుగుతుంటాయి.

By Srikanth Gundamalla  Published on  19 May 2024 2:38 AM GMT
robbery attempt,  train,   Uttarakhand,

సిగ్నల్‌కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం.. షాక్‌ ఇచ్చిన ప్రయాణికులు

రైళ్లలో అప్పుడప్పుడు దోపిడి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే.. రైలు ఆగిన సమయంలో ఈ చోరీలకు పాల్పడుతుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లో దొంగలు తమ తెలివిని చూపించారు. ఏకంగా సిగ్నల్‌కు బురద పూసి రైళ్లు ఆగిపోయేలా చేశారు. ఆ తర్వాత ట్రైన్‌లో దోపిడీకి ప్రయత్నించారు. కానీ.. అందులో ఉన్న ప్రయాణికులు దొంగలకు షాక్‌ ఇచ్చారు. ప్రతిఘటించడంతో దొంగలు తోకముడిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. మొరాదాబాద్-సహారన్‌పుర రైల్వే డివిజన్‌ పరిధిలో లక్సర్‌ రైల్వే స్టేషన్ ఉంది. అయితే.. ఇక్కడ ఎవరూ పెద్దగా తిరగరు. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. స్టేషన్‌ దగ్గరలో ఉన్న సిగ్నల్‌ కనపడకుండా లైట్లకు బురద రాశారు. ఇక దాన్ని దూరం నుంచి చూసిన లోకో పైలట్‌ స్టేషన్‌ నుంచి సిగ్నల్‌ లేదు అని కుని.. పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పుర్-చండీగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒకదాని తర్వాత మరోటి ఆగిపోయాయి. ఇక వెంటనే తమ ప్లాన్‌ అమలు పరిచారు దొంగలు. ట్రైన్‌లోకి ముఠాగా ఏర్పడి ఎక్కేశారు. ప్రయాణికులను బెదిరించి నగదు, నగలను దోచుకోవాలని బెదిరించారు.

అయితే.. ప్రయాణికులు దోపిడీ దారులు వచ్చారని భయపడిపోలేదు. ప్రతిఘటించారు. తిరిగి దొంగలనే భయపెట్టారు. ఇక చివరికి చేసేదేం లేక దొంగలు తోక ముడిచి ట్రైన్‌ దిగి పారిపోయారు. ఈ క్రమంలోనే తమ ప్లాన్ బెడిసికొట్టడంతో దొంగలు ఆగ్రహంతో ట్రైన్‌పైకి రాళ్లు విసిరారు అని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఇక కంట్రోల్‌ రూమ్‌కి లోకో పైలట్ సమచారం ఇచ్చాడు.. దాంతో అధికారులువెంటనే అక్కడికి చేరుకున్నారు. లక్సర్‌ ఆర్పీఎఫ్‌ ఇంచార్జ్‌ ఎస్‌ఐ సహా పలువురు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Next Story