ఇక డ్రైవింగ్‌ టెస్ట్ లేకుండానే లైసెన్స్

Road ministry notifies rules for accredited driver training centres.డ్రైవింగ్​ లైసెన్స్​ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 1:45 AM GMT
ఇక డ్రైవింగ్‌ టెస్ట్ లేకుండానే లైసెన్స్

డ్రైవింగ్​ లైసెన్స్​ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించే పరీక్ష పాస్​ కావాల్సిందే. అయితే తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఈ విధానంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు జూలై 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధన మేరకు నమోదు చేసుకున్న డ్రైవింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటారో వారికి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది.

శిక్షణా కేంద్రంలో సిమ్యులేటర్లు, ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండాలి. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాలలో రెమెడియల్, రిఫ్రెషర్ కోర్సులు అందుబాటులో ఉండాలి. ఈ కేంద్రాల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు డ్రైవింగ్ పరీక్ష అవసరం నుండి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ పరీక్షను ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) నిర్వహిస్తుంది. ఈ కేంద్రాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట శిక్షణ ఇవ్వడానికి కూడా అనుమతించబడతాయి.

శిక్ష‌ణా సంస్థ‌లు గుర్తింపు పొందాలంటే..?

- ద్విచ‌క్ర‌, త్రిచ‌క్ర, తేలిక‌పాటి వాహ‌నాల డ్రైవింగ్‌లో శిక్ష‌ణ ఇచ్చేందుకు గుర్తింపు పొందిలంటే క‌నీసం ఒక ఎక‌రా స్థ‌లం ఉండాలి.

- ద్విచ‌క్ర‌, త్రిచ‌క్ర‌, తేలిక‌పాటి, మీడియం, భారీ ప్యాసింజ‌ర్‌, స‌ర‌కు ర‌వాణా వాహ‌నాలు, ట్రైయిలర్స్ న‌డ‌ప‌డంలో శిక్ష‌ణ ఇవ్వడానికి కేంద్రం న‌డ‌పాలంటే క‌నీసం రెండెక‌రాల స్థ‌లం ఉండాలి

- రెండు త‌ర‌గ‌తి గ‌దులు ఉండాలి. థియ‌రీ త‌ర‌గ‌తులు, ట్రాఫిక్ నిబంధ‌న‌లు, డ్రైవింగ్ ప్ర‌క్రియ‌, వాహ‌న మెకానిజం, ప్ర‌జాసంబంధాలు, ప్రాథ‌మిక చికిత్స విష‌యాల‌పై పాఠాలుచెప్పేందుకు కంప్యూట‌ర్, మ‌ల్టీమీడియా ప్రొజెక్ట‌ర్ ఉప‌యోగించాలి.

- రివ‌ర్స్ పార్కింగ్ , ఎగుడు, దిగుళ్ల‌లో వాహ‌నం న‌డిపేందుకు అనువైన శిక్ష‌ణ ఇచ్చేందుకు అన్నిర‌కాల డ్రైవింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి

- శిక్ష‌ణ ఇచ్చే వాహ‌నాల‌కు భీమా త‌ప్ప‌నిస‌రి

- డ్రైవింగ్ స్కూల్‌కు ఒక‌సారి అక్రిడిటేష‌న్ మంజూరు చేస్తే అయిదేళ్ల‌పాటు అది అమ‌ల్లో ఉంటుంది. గ‌డువు ముగిసేందుకు 60 రోజుల ముందు రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది.


Next Story
Share it