హిందీ నేర్చుకోవాలన్న జొమాటో ఉద్యోగి.. యాప్‌ను డిలీట్ చేస్తున్న నెటీజ‌న్లు..!

Rejectzomato Is Trending On Twitter.ఆన్‌లైన్ పుడ్ డెలివ‌రీ యాప్ జొమాటోకు భారీ షాక్ త‌గిలింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2021 9:20 AM GMT
హిందీ నేర్చుకోవాలన్న జొమాటో ఉద్యోగి.. యాప్‌ను డిలీట్ చేస్తున్న నెటీజ‌న్లు..!

ఆన్‌లైన్ పుడ్ డెలివ‌రీ యాప్ జొమాటోకు భారీ షాక్ త‌గిలింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్.. ఓ క‌స్ట‌మ‌ర్‌తో చేసిన చాట్ కార‌ణంగా జొమాటో యాప్‌ను పెద్ద సంఖ్య‌లో నెటిజ‌న్లు డిలీట్ చేస్తున్నారు. వెంట‌నే న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించినప్ప‌టికి కూడా.. యూజ‌ర్ల నుంచి జొమాటోకు నిర‌స‌న‌ల సెగ ఆగ‌డం లేదు.

వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడుకు చెందిన వికాస్‌ అనే వ్య‌క్తి సోమ‌వారం సాయంత్రం కొన్ని ర‌కాల పుడ్ ఐట‌మ్స్‌ను జొమాటోలో ఆర్డ‌ర్ చేశారు. కాగా.. తాను ఆర్డ‌ర్ చేసిన ఐట‌మ్స్‌లో కొన్ని ఐట‌మ్స్ మిస్ అయ్యాయి. దీంతో స‌ద‌రు రెస్టారెంట్‌కు కాల్ చేయ‌గా.. స్పంద‌న లేక‌పోవ‌డంతో జొమాటో క‌స్ట‌మ‌ర్ కేర్‌తో చాట్ చేశాడు. స‌ద‌రు రెస్టారెంట్ సిబ్బంది స‌రిగ్గా స్పందించ‌డం లేద‌ని.. వారికి బాష స‌మ‌స్య‌గా మారింద‌ని జొమాటో ప్ర‌తినిధి చెప్పాడు. కాగా.. అది త‌న స‌మ‌స్య కాద‌ని.. మిస్ అయిన ఐట‌మ్స్‌కు న‌గ‌దును రీఫండ్ చేయాల‌ని జొమాటో ప్ర‌తినిధిని వికాస్ కోరాడు. త‌మ వ‌ల్ల కావ‌డం లేద‌ని.. క‌నుక న‌గ‌దును రీఫండ్ చేయ‌డం కుద‌ర‌ద‌ని జొమాటో ప్ర‌తినిధి చెప్పాడు.

దీంతో వికాస్‌కు మండిపోయింది. త‌మిళ‌నాడులో వ్యాపారం చేస్తూ.. త‌మిళం తెలియ‌పోతే ఎలా.. త‌మిళ్ తెలిసిన వాళ్ల‌ని ప‌నిలో పెట్టుకోవ‌చ్చు గ‌దా అని ప్ర‌శ్నించాడు. ఇందుకు జొమాటో ప్ర‌తినిధి స్పందిస్తూ.. హింది జాతీయభాష‌.. మీరు కూడా హిందీ నేర్చుకోవ‌చ్చు క‌దా..? నేర్చుకుని ఉండి ఉంటే బాగుండేది అని బదులిచ్చాడు. త‌న‌కు ఎదురైన ఈ స‌మ‌స్య‌ను వికాస్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. జొమాటో ప్ర‌తినిధితో చేసిన చాట్ స్క్రీన్ షాట్స్‌ను కూడా షేర్ చేశాడు. ఇది కాస్త వైర‌ల్‌గా మారింది.

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు బాషాభిమానం ఎక్కువే అన్న సంగ‌తి తెలిసిందే. దీంతో వారు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. జొమాటో యాప్‌ను డిలీట్ చేస్తున్నారు. ట్విట్ట‌ర్‌లో పెద్ద ఎత్తున #Reject_Zomato అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై జొమాటో స్వ‌యంగా వికాస్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పడంతో పాటు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ నిర‌స‌న‌ల సెగ ఆగ‌డం లేదు.

Next Story