5 రోజుల పాటూ ఎర్రకోటలోకి నో ఎంట్రీ

Red Fort to remain closed for visitors from 22 to 26 Jan.ఎర్ర‌కోట ఐదు రోజుల‌పాటు మూత‌ప‌డ‌నుంది. రిపబ్లిక్ డే దృష్ట్యా

By M.S.R  Published on  20 Jan 2022 1:35 PM IST
5 రోజుల పాటూ ఎర్రకోటలోకి నో ఎంట్రీ

ఎర్ర‌కోట ఐదు రోజుల‌పాటు మూత‌ప‌డ‌నుంది. రిపబ్లిక్ డే దృష్ట్యా, భద్రతా కారణాల దృష్ట్యా ఎర్రకోట జనవరి 22 నుండి 26 వరకు ప్రజలకు, సాధారణ సందర్శకులకు మూసివేయబడుతుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌ల్లో భాగంగా ఐదు రోజుల‌పాటు ఎర్ర‌కోట‌లోకి సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు వివరించారు. గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా చారిత్ర‌క క‌ట్టడం వ‌ద్ద‌ మూడంచ‌ల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 24న ప్రారంభ‌మ‌వుతాయి. అయితే ఈ ఏడాది ఒక రోజు ముందుగానే జ‌న‌వ‌రి 23న ఆరంభంకానున్నాయి. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే వేడుక‌ల‌ను ప్రారంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఉగ్రవాద నిరోధక చర్యలను చేపడుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. పంజాబ్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ భద్రతా ఉల్లంఘనలను ఉటంకిస్తూ, దేశ రాజధానిలో అలాంటి సంఘటన జరగకుండా చూసేందుకు బలగాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

Next Story