మరో అల్పపీడనం.. అతి భారీ వర్షాలు.. 2న రెడ్‌ అలర్ట్‌

Red alert in Tamilnadu I ..చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. డిసెంబర్‌

By సుభాష్  Published on  30 Nov 2020 1:37 AM GMT
మరో అల్పపీడనం.. అతి భారీ వర్షాలు.. 2న రెడ్‌ అలర్ట్‌

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. డిసెంబర్‌ 1 నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. 2న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తుగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. నివర్‌ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం చెన్నైకి రానుంది. నివర్‌ తుఫాను తీరం దాటి నాలుగు రోజులు అవుతున్నా.. చెన్నై శివార్లలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షపు నీరు చేరి ఉన్నాయి.

ఈ సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రకృతమైన ఈ అల్పపీడనం ఆదివారం మరింత బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. 1వతేదీన మరంత బలపడనున్న నేపథ్యంలో ఈ ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడుపై పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముందుగా సముద్ర తీర జిల్లాలో మోస్త వర్షం, 2న అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే 'బురేవి' తుఫానుగా మారి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని,దనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో అధికార వర్గాలు ముందస్తు జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

నేడు కేంద్ర బృందం రాక

నివర్‌ తుఫాను కారణంగా కేంద్ర పాలిక ప్రాంతం పుదుచ్చేరి, రాష్ట్రంలోనికడలూరు, విల్లుపురంలలో ప్రభావం అధికమే. మిగతా జిల్లాల్లో ఆశాజనకంగా పడ్డాయి. తుఫాను నష్టం పరిస్థితుల అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు సోమవారం ప్రత్యేక బృందం చెన్నైకి రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోస్‌ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాత్రి చెన్నైకి వచ్చే ఈ బృందం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అగ్ని షణ్ముగంతో భేటీ అవుతుంది. ఆ తర్వాత నివర్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. చివరగా చెన్నైలో సీఎం పళనిస్వామితో ఈ బృందం భేటీ అవుతుంది. కాగా, ఈ బృందం ఇచ్చే నివేదికతో కేంద్రం సాయం చేయనుంది.

Next Story