'గుడ్‌బై మై డియర్‌ లైట్‌ హౌస్‌'.. గుండెల్ని తడిమేస్తున్న టాటా యంగ్‌ఫ్రెండ్‌ పోస్ట్‌

ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ జనరల్ మేనేజర్, రతన్ టాటా అసిస్టెంట్‌ శంతను నాయుడు.. వ్యాపారవేత్త, జాతీయ దిగ్గజం రతన్‌ టాటా మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

By అంజి
Published on : 10 Oct 2024 1:21 PM IST

Ratan Tata, tribute , national icon, Shantanu Naidu

'గుడ్‌బై మై డియర్‌ లైట్‌ హౌస్‌'.. గుండెల్ని తడిమేస్తున్న టాటా యంగ్‌ఫ్రెండ్‌ పోస్ట్‌

ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ జనరల్ మేనేజర్, రతన్ టాటా అసిస్టెంట్‌ శంతను నాయుడు.. వ్యాపారవేత్త, జాతీయ దిగ్గజం రతన్‌ టాటా మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్‌గా పనిచేసిన టాటా, 86 ఏళ్ళ వయసులో మరణించారు. ఈ క్రమంలోనే టాటా అసిస్టెంట్‌ శంతనూ నాయుడి సోషల్‌ మీడియా పోస్ట్‌ గుండెల్ని తడిమేస్తోంది.

''మా స్నేహా బంధానికి లోటు ఏర్పడింది. దానిని పూడ్చుకుంటూ నేనిప్పుడు జీవితం గడపాలి. ప్రేమకు దుఃఖమే మూల్యం. గుడ్‌ బై మై డియర్‌ లైట్‌ హౌస్‌'' అన్న పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. వయసు రీత్యా 56 ఏళ్ల తేడా ఉన్న వీరిని జంతువులపై ప్రేమే కలిపింది. అర్ధరాత్రి వీధికుక్కల్ని కాపాడుతున్న శంతనూను 2014లో టాటా తన ఆఫీస్‌కు జీఎంగా నియమించారు.

నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన రతన్‌ టాటా భౌతికకాయం ముంబైలోని ఎన్‌సీపీఏ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి.

Next Story