రాసలీలల మంత్రి ఆమెను అలా ట్రాప్ చేశారట..!

Ramesh Jarkiholi CD scandal Accused woman releases social media video.కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 14 March 2021 4:00 PM IST

Ramesh Jarkiholi CD scandal Accused woman releases social media video

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియోలపై బాధిత యువతి మరోసారి స్పందించింది. క‌ర్నాట‌క మంత్రి ర‌మేశ్ జార్కిహొలి.. త‌న‌ని శారీర‌కంగా ఉప‌యోగించుకున్నాడ‌ట. ప్ర‌లోభ పెట్టి ద‌గ్గ‌రికి తీసుకున్నాడ‌ట‌. త‌న అందం చూసి.. ఆమెను ఉప‌యోగించుకోవాల‌ని ఫిక్స్ అయిన ర‌మేశ్.. ఆమె బ‌ల‌హీన‌త‌ల‌ను ఉప‌యోగించుకుని.. ఆమెతో శారీర‌క సుఖం పొందాడ‌ని ఆరోపణలు వచ్చాయి. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించారని, తనతో సన్నిహితంగా ఉన్న వీడియో సీడీని ఆయనే విడుదల చేశారని అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమె 11 రోజుల అనంతరం గత రాత్రి సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. వీడియోను ఎవరు, ఎప్పుడు, ఎలా చిత్రీకరించారన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చింది. వీడియో బయటకు రావడంతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. మూడు నాలుగు సార్లు ఆత్మహత్యకు కూడా యత్నించినట్టు తెలిపింది. తన వెనక ఎవరూ లేరని, తన తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించాడని.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మైని కోరింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బాధిత యువతి అజ్ఞాతం నుంచే వీడియో విడుదల చేయడంతో ఆమె ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టంగా మారింది.




Next Story