Ramadan 2023: భారత్‌లో రేపటి నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం

ముస్లింలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగల్లో రంజాన్‌ ఒకటి. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. ప్రతి సంవత్సరం 9వ మాసంలో

By అంజి  Published on  23 March 2023 9:02 AM GMT
Ramadan 2023, Ramadan fasting

Ramadan 2023: భారత్‌లో రేపటి నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం 

ముస్లింలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగల్లో రంజాన్‌ ఒకటి. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. ప్రతి సంవత్సరం 9వ మాసంలో రంజాన్‌ పండుగను నిర్వహిస్తారు. అయితే నేటి నుంచే రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం అవుతాయని భావించారు ముస్లింలు. అయితే బుధవారం సాయంత్రం చంద్రుడు కనిపించలేదు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే నెలవంక బుధవారం సాయంత్రం కనిపించలేదని మర్కాజీ రూట్-ఇ-హిలాల్ కమిటీ (సెంట్రల్ మూన్ సైటింగ్ కమిటీ) తెలిపింది. అంతకుముందు భారత్‌లో రంజాన్‌ మాస ప్రారంభం తేదీని ప్రకటించడానికి ఈ కమిటీ బుధవారం నాడు తన నెలవారీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని అస్తానా షుతారియా దబీర్‌పురాలోని ఖాన్‌కా కమిల్‌లో నిర్వహించింది.

అయితే నిన్న చంద్రుడు కనిపించలేదు. జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన నివేదికలు చంద్రుడు కనిపించలేదని పేర్కొన్నాయి. ఆ తర్వాత మార్చి 23వ తేదీ గురువారం షాబాన్ మాసం చివరి రోజుగా కమిటీ ప్రకటించింది. దీంతో శుక్రవారం నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయనున్నారు. ఏప్రిల్‌ 23వ తేదీన ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో నేటికీ నెలవంక కనిపించకపోవడంతో శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు లక్నోలోని మర్కజీ చంద్ కమిటీ ప్రకటించింది. నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ మార్చి 24న ప్రారంభమవుతుందని మహారాష్ట్రలోని మాలెగావ్, జామ్నేర్ ప్రకటించాయి.

సౌదీ అరేబియాలో రంజాన్

సౌదీ అరేబియాలో మంగళవారం సాయంత్రం వరకూ నెలవంక కనిపించలేదు. అందువల్ల దేశంలో రంజాన్ గురువారం ప్రారంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో సహా ఇతర మధ్యప్రాచ్య దేశాలకు కూడా ఇదే వర్తిస్తుంది. భారతదేశంలో, మొత్తం ప్రపంచంలో రంజాన్ ఉపవాసం, ప్రార్థన, దాతృత్వ పనుల ద్వారా గుర్తించబడుతుంది. పవిత్ర మాసంలో పేదలకు సహాయం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తారు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయి.

Next Story