అయోధ్య రామమందిరపు 'ప్రాణ్‌ప్రతిష్ఠ' మహోత్సవానికి ఇంకా గంటల సమయం మిగిలి ఉండగానే, అయోధ్యను సందర్శకులకు స్వాగతించేలా అన్ని రకాల అలంకరణలతో ముస్తాబైంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఈ మహా కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రేపు హాజరై రామ మందిరాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు సన్నాహకంగా పవిత్ర నగరాన్ని ఉత్సాహభరితమైన పూలతో అలంకరించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. జనవరి 23 నుండి రామ మందిరాన్ని సాధారణ ప్రజలకు 'దర్శనం' కోసం తెరవనున్నట్లు తెలిపారు.
అయోధ్య, పవిత్ర నగరం, 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు సన్నాహకంగా ప్రకాశవంతమైన పుష్పాలతో అలంకరించబడింది. అయోధ్య నగరం అంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. ఆలయానికి వెళ్లే దారులన్నీ శ్రీరాముని చిత్రపటాలే దర్శనమిస్తున్నాయి. మొత్తంగా అయోధ్యలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది. శ్రీహనుమాన్ మహా యాగశాల దగ్గర 1,008 యజ్ఞ కుండాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహిస్తున్నారు. ఈప్రాంతం అంతా భక్తులతో కిక్కిరిసోయింది. అలాగే రామాలయ ప్రారంభానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌకర్యార్థం ఆలయం దగ్గర బ్యాటరీ కార్లను సిద్ధం చేశారు. రేపు ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ముందు భద్రతను కట్టుదిట్టం చేయడంతో లతా మంగేష్కర్ చౌక్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు.