కోడలిని నగ్నంగా వీధుల్లో ఊరేగించిన అత్తింటివారు
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను భర్త, అత్తామామ ముగ్గురూ కలిసి నగ్నంగా చేసి కొడుతూ గ్రామంలో ఊరేగించారు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 9:27 AM ISTకోడలిని నగ్నంగా వీధుల్లో ఊరేగించిన అత్తింటివారు
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను భర్త, అత్తామామ ముగ్గురూ కలిసి నగ్నంగా చేసి కొడుతూ గ్రామంలో ఊరేగించారు. ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో దారుణంగా ప్రవర్తించారు. ప్రతాప్‌ఘడ్ జిల్లాలో ఈ సంఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన राजस्थान में पहाड़ा ग्राम पंचायत, धरियावद पंचायत समिति, ज़िला प्रतापगढ़ में जनजाति समुदाय की गर्भवती महिला के, उसके ही पति द्वारा गाँव वालों के सामने कपड़े उतारे गए। 😔😔
प्रतापगढ़ के कुछ मित्रों द्वारा प्राप्त सूचना के अनुसार उक्त महिला अपने पति को छोड़कर किसी अन्य पुरुष के साथ… pic.twitter.com/i6juIRn6QM
అయితే.. వివాహేతర సంబంధం పెట్టుకుని.. మరో వ్యక్తితో ఉంటున్న మహిళను ఆమె భర్త, అత్తామామలు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. కొట్టంలో బంధించి తీవ్రంగా కొట్టారు. అది సరిపోదు అన్నట్లు ఆమెను వివస్త్రను చేసి ఊర్లో ఊరేగించారు. గిరిజన మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో.. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. డీజీపీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన గ్రామానికి చేరుకుని మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త, అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిపారు. పౌర సమాజంలో ఇలాంటి నేరగాళ్లకు స్థానం లేదని వ్యాఖ్యానించారు సీఎం అశోక్ గెహ్లాట్. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి.. త్వరగా బాధితురాలికి న్యాయం అందిస్తామని చెప్పారు. నిందితులను వీలైనంత త్వరగా కటకటాల్లోకి పంపిస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇది అమానవీయ ఘటన అని అంటున్నారు. అయితే.. ఈ ఘటన జరిగి రెండ్రోజులు అయినా పోలీసులు రిపోర్టు సిద్ధం చేయలేదని బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.