కర్ణిసేన పార్టీ అధ్యక్షుడు దారుణ హత్య
రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 4:06 PM ISTకర్ణిసేన పార్టీ అధ్యక్షుడు దారుణ హత్య
రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నిసేన పార్టీ అధ్యక్షుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా తుపాకీతో కాల్చి చంపారు. ఈ సంఘటన రాజస్థాన్ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. గోగమేడిలో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన పార్టీ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి నివాసం ఉంది. ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై ఆయన నివాసం వద్దకు వచ్చారు. ఆయనతో ఏదో పని ఉన్నట్లు చెప్పి ఇంట్లోకి వచ్చారు. సుఖ్‌దేవ్ సింగ్ వారితో ఇంట్లోనే కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఉన్నట్లుండి దుండగులు వారితో తెచ్చుకున్న తుపాకులను తీసి కాల్పులు మొదలు పెట్టారు. నేరుగా సుఖ్‌దేవ్‌ను ముందుగా కాల్చారు. ఆ తర్వాత మరో వ్యక్తిపైనా కాల్పులు జరిపారు. ఇదంతా సుఖ్‌దేవ్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
కాల్పుల్లో సుఖ్‌దేవ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో.. అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో సుఖ్‌దేవ్‌తో పాటు అజిత్ సింగ్ అనే వ్యక్తి కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశామని.. విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.