IRCTCలో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌.. సేవలకు అంతరాయం

ఇండియన్ రైల్వేస్ యొక్క ఇ-టికెటింగ్ విభాగం ఐఆర్‌సీటీసీలో టెక్నికల్‌ సమస్య ఏర్పడింది.

By అంజి
Published on : 25 July 2023 12:09 PM IST

Rail ticket, booking service, IRCTC ,  Amazon, MakeMyTrip

IRCTCలో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌.. సేవలకు అంతరాయం

ఇండియన్ రైల్వేస్ యొక్క ఇ-టికెటింగ్ విభాగం ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌)లో టెక్నికల్‌ సమస్య ఏర్పడింది. "సాంకేతిక సమస్య" కారణంగా తన వెబ్‌సైట్, యాప్‌లో సేవలు నిలిచిపోయాయని మంగళవారం తెలిపింది. దీంతో రైల్వే టికెట్‌ బుకింగ్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విటర్‌ ద్వారా తెలిపింది. IRCTC వెబ్ పోర్టల్, యాప్‌లోని సేవలు ఉదయం 8 గంటల నుండి నిలిచిపోయినట్లు రిపోర్ట్‌ చేయబడింది. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్‌ఐఎస్‌ టెక్నికల్‌ టీమ్‌ ప్రయత్నిస్తోందని తెలిపింది.

సమస్య పరిష్కారమైన వెంటనే సేవలు అందుబాటులోకి తెస్తామని, త్వరలోనే ఈ విషయాన్ని అప్‌డేట్‌ చేస్తామని ఐఆర్‌సీటీసీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. సమస్య పరిష్కారం అవుతున్న నేపథ్యంలో.. ప్రయాణికులు మేక్‌మైట్రిప్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ టికెట్లు బుక్‌ అవ్వట్లేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరగా సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు. పీక్ అవర్స్‌లో సర్వర్ డౌన్ అవడం పట్ల చాలా మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Next Story