రాహుల్‌గాంధీ కారు అద్దాలు పగిలిన ఘటనపై కాంగ్రెస్ క్లారిటీ
రాహుల్‌గాంధీ కారు అద్దాలు పగిలిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 5:11 PM ISTరాహుల్‌గాంధీ కారు అద్దాలు పగిలిన ఘటనపై కాంగ్రెస్ క్లారిటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాహుల్‌గాంధీ యాత్ర పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది. అయితే.. అక్కడ రాహుల్‌గాంధీ కారుపై దాడి జరిగిందనీ.. ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. రాహుల్‌గాంధీ కారుపై ఎలాంటి దాడి జరగలేదని.. కారు అద్దాలు ఎలా పగిలాయనే దానిపై వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఒక పోస్టు పెట్టింది.
రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చేరుకుంది. అక్కడ రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తుండగా కొందరు ఆయన కారుపై రాళ్లు విసిరారని అక్కడి స్థానిక నేతలు చెప్పారు. కారు అద్దాలు పగిలిపోయిన వీడియో కూడా బయటకు వచ్చింది. దాంతో.. అందరూ నిజంగానే ఎవరో దాడి చేశారని భావించారు. రాళ్లు విసిరిన కారణంగానే కారు అద్దం పగిలిపోయి ఉంటుందని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కూడా పేర్కొన్నారు.
కానీ ఈ వార్త వైరల్ అవుతుండానే వెంటనే కాంగ్రెస్ పార్టీ స్పందించి ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది. 'మాల్డాలో రాహుల్‌గాంధీని కలిసేందుకు బారీగా జనం తరలి వచ్చారు. ఆ జనసమూహంలో, రాహుల్‌ను కలిసేందుకు ఒక మహిళ అకస్మాత్తుగా కారు ముందుకు వచ్చింది. దాంతో.. ఆమెకు కారు తగలకుండా ఉండేందుకు డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేక్ వేయాల్సి వచ్చిఇంది. అప్పుడే సెక్యూరిటీ సర్కిల్‌లో ఉన్న తాడు కారణంగా కారు అద్దం పగిలింది' అని కాంగ్రెస్ ఎక్స్‌లో వివరణ ఇచ్చింది.
ఇక ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై రాహుల్‌గాంధీ పోరాడుతున్నారు.. ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజలు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారనీ, ప్రజలే వారిని సురక్షితంగా ఉంచుతున్నారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టుతో ఈ ఘటనపై క్లారిటీ వచ్చింది. ఎవరో చేసిన దాడి కాదనీ.. జనసమూహం ఏర్పడటం వల్ల సెడన్ బ్రేక్ వేయడంతో సెక్యూరిటీ తాడు ఒత్తిడికి పగిలిపోయిందని తెలిసింది.
गलत खबर को लेकर स्पष्टीकरण
— Congress (@INCIndia) January 31, 2024
पश्चिम बंगाल के मालदा में राहुल जी से मिलने अपार जनसमूह आया था। इस भीड़ में एक महिला राहुल जी से मिलने अचानक उनकी कार के आगे आ गई, इस वजह से अचानक ब्रेक लगाई गई।
तभी सुरक्षा घेरे में इस्तेमाल किए जाने वाले रस्से से कार का शीशा टूट गया।
जननायक…