వివాహిత‌కు మెసేజ్ పెట్టిన యువ‌కుడు.. చిత‌క‌బాదిన భ‌ర్త‌.. పోలీసుల రిప్లై సూప‌ర్

Punjab Police Has Epic Reply For Man Beaten Up For Texting 'I Like You' to Neighbour's Wife.ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉంది క‌దా అని సోష‌ల్ మీడియాలో ఎవ్వ‌రికి పడితే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2022 1:26 PM IST
వివాహిత‌కు మెసేజ్ పెట్టిన యువ‌కుడు.. చిత‌క‌బాదిన భ‌ర్త‌.. పోలీసుల రిప్లై సూప‌ర్

ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉంది క‌దా అని సోష‌ల్ మీడియాలో ఎవ్వ‌రికి పడితే వారికి ఎలా ప‌డితే అలా మెసేజ్‌లు చేస్తే త‌రువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు మాకేం కాదు.. మ‌మ్మ‌ల్ని ఎవ్వ‌రు ఏం చేయ‌లేరు అన్న చందంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అలా ఓ ప్ర‌బ‌ద్ధుడు.. ఓ వివాహిత‌కు 'ఐ లైక్ యూ 'అని మెసేజ్ పెట్టాడు. ఎవ‌రో తెలియ‌ని పెట్టిన మెసేజ్‌ను స‌ద‌రు మ‌హిళ త‌న భ‌ర్త‌కు చూపించింది. ఇంకేముందు ఆమె భ‌ర్త స‌ద‌రు యువ‌కుడి అడ్ర‌స్ ఎలాగోలా క‌నుక్కోని మ‌రీ అత‌డికి ఇంటికి వ‌చ్చి చావ‌బాదాడు. దీంతో ఆ బాధిత యువ‌కుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోలీసులను ఆశ్ర‌యించ‌గా పోలీసులు ఇచ్చిన రిప్లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. సుశాంత్ ద‌త్ అనే యువ‌కుడు ఓ వివాహిత‌కు 'నువ్వంటే నాకు ఇష్టం( I Like You) 'అనే మెసేజ్‌ను పెట్టాడు. ఆమె భ‌ర్త వ‌చ్చి స‌ద‌రు యువ‌కుడిని చిత‌క‌బాదాడు. దీంతో ఆ యువ‌కుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 'సార్‌.. నేను ఒకరికి I like u మెసేజ్ పంపాను. ఆమె భర్త వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. నేను చాలాసార్లు క్షమించమని అడిగాను. అయినా సరే అతను మ‌ళ్లీ మ‌ళ్లీ కొట్టాడు. ఇప్పుడు నాకు రక్షణ కావాలి అనిపిస్తోంది. దయచేసి ఏదైనా చెయ్యండి. నన్ను కాపాడండి. ఆయన మళ్లీ నాపై దాడి చేసే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశాడు.


దీనికి పోలీసులు ఇలా బ‌దులు ఇచ్చారు.'మీరు ఓ మహిళకు అలా మెసేజ్‌ పెట్టి ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. అయితే.. ఆమె భర్త మాకు ఫిర్యాదు చేయకుండా మిమ్మల్ని అలా కొట్టడం కూడా కరెక్ట్‌ కాదు. మేము మీకు సరైన సెక్షన్ కింద సరైన శిక్ష వేస్తాం. ఈ రెండు అంశాలకూ చట్ట ప్రకారం దర్యాప్తు ఉంటుంది. ఇద్దరి పైనా చట్టప్రకారం చర్యలుంటాయి' అని తెలిపారు. అంతేకాదు ద‌గ్గ‌రిలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల‌ని అత‌డికి సూచించారు. దీంతో ఖంగుతిన్న ఆయువ‌కుడు కాసేప‌టికి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. అయితే.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. వీరి సంబాష‌ణ‌ల‌ను సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story