కూరగాయల బుట్టలు బూటుతో తన్ని.. సస్పెండ్ అయిన పోలీస్

Punjab cop Kicks Basket. కూరగాయలు అమ్ముకునే వ్యక్తుల మీద కోపంతో ఆ బుట్టలను బూటు కాలితో తన్నాడు ఓ పోలీస్ అధికారి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 11:02 AM GMT
Punjab cop kicks basket

ఒక్కోసారి మనుషులు మానవత్వాన్ని మరచిపోతుంటారు. ఇలాంటి వ్యాఖ్యలు మామ్ములు వ్యక్తులకంటే పోలీసుల మీద ఇంకాస్త ఎక్కువ వస్తాయి. అందరూ కాకపోయినా కొందరు పోలీసులు అయినా అలా ప్రవర్తిస్తు ప్రజలను ఇబ్బంది పెట్టిన సంఘటనలు తరచుగా చూస్తూనే ఉంటాం.. కూరగాయలు అమ్ముకునే వ్యక్తుల మీద కోపంతో ఆ బుట్టలను బూటు కాలితో తన్నాడు ఓ పోలీస్ అధికారి. ఈ వీడియో వైరల్ అవడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఫగ్వారా SHO నవదీప్ సింగ్ అతని టీం టౌన్ లో పాట్రోలింగ్ కు వెళ్లింది.

పంజాబ్ లో పాక్షిక లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో వారు సారాయ్ రోడ్ కు రాగానే చాలా మంది రోడ్ పక్కనే దుకాణాలు పెట్టుకుని కనపడ్డారు. కోపంతో కార్ దిగిన నవదీప్ సింగ్ కార్ దిగిన వెంటనే కూరగాయల దుకాణాల దగ్గరకు వెళ్లి బూటు కాలితో బుట్టలను తన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై తక్షణమే స్పందించిన ఉన్నంతధికారులు అతణ్ని సస్పెండ్ చేశారు. అటువంటి చర్యలు కరెక్ట్ కాదని రూల్స్ కు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తే శిక్ష తప్పదని వారించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు అహర్నిశలు పోలీసులు సేవలు అందిస్తున్నారనీ, అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రవర్తన అతనికే కాకుండా పూర్తి పోలీసు డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తీసుకొస్తుందని అన్నారు.

దీనిపై డిపార్టమెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పారు. ఈ సంఘటన పై పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా కూడా ట్వీట్ చేశారు. నిజంగా ఇది సిగ్గు పడాల్సిన విషయం అన్న ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడిన వీరిపై సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు


Next Story
Share it