'నిండు జీవితానికి రెండు చుక్కలు'.. నేడే పల్స్ పోలియో
'నేషనల్ ఇమ్యునైజేషన్ డే'ను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేస్తారు.
By అంజి Published on 3 March 2024 1:55 AM GMT'నిండు జీవితానికి రెండు చుక్కలు'.. నేడే పల్స్ పోలియో
'నేషనల్ ఇమ్యునైజేషన్ డే'ను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వైద్య అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3 నుండి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. అనేక ప్రాంతాల్లో ఆరోగ్య అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్‌లను (మొబైల్ , నాన్-మొబైల్) ఏర్పాటు చేశారు.
తల్లిదండ్రులు తప్పకుండా ఆదివారం(మార్చి 3న) చిన్నపిల్లలకు పోలియో చుక్కులు వేయించండి. ఎన్ని పనులు ఉన్నా బాధ్యాతయుతంగా పిల్లలను దగ్గర్లోని కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కలు వేయించాలి. పోలియో వ్యాది నివారణకు టీకా తప్పా మరొకటి లేకపోవడంతో పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని డాక్టరల్లు సూచిస్తున్నారు. ఒక వేళ మార్చి 3 న మర్చిపోతే నాలుగు,ఐదు తేదీల్లో ఆయా గ్రామాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆదివారం బూత్‌డే కాగా.. 4,5 తేదీల్లో గ్రామీణ ప్రాంతాల్ల్లో, 6న పట్టణ ప్రాంతాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. ఏపీలో 53,35,519 మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 37,465 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 'నిండు జీవితానికి రెండు చుక్కలు' నినాదం ద్వారా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. పోలియో చుక్కల ప్రయోజనాన్ని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓలను కమిషనర్ జె.నివాస్ ఆదేశించారు.