రాజ్యసభ వైస్ చైర్మన్‌గా పీటీ ఉష, విజయసాయి రెడ్డి

PT Usha, Vijaya Sai Reddy nominated to vice-chairman’s panel. లెజెండరీ మాజీ అథ్లెట్, నామినేటెడ్ రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష పార్లమెంట్ ఎ

By అంజి  Published on  20 Dec 2022 7:34 AM GMT
రాజ్యసభ వైస్ చైర్మన్‌గా పీటీ ఉష, విజయసాయి రెడ్డి

లెజెండరీ మాజీ అథ్లెట్, నామినేటెడ్ రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష పార్లమెంట్ ఎగువ సభలోని వైస్ చైర్‌పర్సన్ ప్యానెల్‌కు నామినేట్ అయ్యారు. ఈ నిర్ణయాన్ని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యానెల్‌లో నామినేటెడ్ సభ్యులను నియమించడం ఇదే తొలిసారి అన్నారు. ఆమెతో పాటు వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా వైఎస్‌ చైర్మన్‌ ప్యానెల్‌లో చోటు దక్కింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభ ప్యానల్ జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరూ చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ లేని సమయంలో రాజ్యసభను నిర్వహిస్తారు.

ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం.. రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రల్హాద్ జోషికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతృప్తి చెందేలా సభ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రయత్నిస్తానంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాగా పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత ఇది జరిగింది. 58 ఏళ్ల పీటీ ఉషా.. బహుళ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది.




Next Story