కుటుంబ రాజకీయాలతో మోసపోయింది యువతే: ప్రధాని మోదీ

జమ్ముకశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 2:38 PM IST
prime minister, narendra modi, tour, jammu kashmir ,

 కుటుంబ రాజకీయాలతో మోసపోయింది యువతే: ప్రధాని మోదీ

జమ్ముకశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రూ.32వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ అనేక దశాబ్దాలుగా రాజవంశ రాజకీయాల బాధితుడిగా ఉందని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న వారు మాత్రం స్వప్రయోజనాల కోసం ఏదీ పట్టించుకోలేదని విమర్శించారు. అయితే. ఇలాంటి వంశపారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా మోసపోయింది మాత్రం యువతే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఆర్టికల్ 370 అనేది ఒక గోడ వంటిదనీ.. దాన్ని బీజేపీ ప్రభుత్వం తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ సమతుల్య అభివృద్ధి దిశగా వెళ్తోందని చెప్పారు. వందలాది మంది యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు అందజేశామని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌లో వంశపారంపర్య రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్న సంతృప్తి ఉందని మోదీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లో సామాజిక న్యాయం కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. గుజ్జర్లు, పహారీలు, ఎస్టీలు, ఎస్సీలు, కశ్మీరీ పండిట్లు, పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు రాష్ట్రంలో హక్కులు పొందారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముశ్మీర్‌లో పర్యటన సందర్భంగా.. సంగల్దాన్‌ స్టేషన్-బారాముల్లా స్టేషన్‌ మధ్య మొదటి ఎలక్ట్రిక్‌ రైలును ప్రారంభించారు. బనిహాల్-ఖరీ-సుంబాద్-సంగల్దాన్ (48 కిలోమీటర్లు) కొత్త విద్యుద్దీకరించబడిన బారాముల్లా-శ్రీనగర్-బనిహాల్-సంగల్దాన్‌ సెక్షన్‌ (185.66 కి.మీ) మధ్య కొత్త రైలు మార్గంతో పాటు జమ్ము, కశ్మీర్‌లో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Next Story