పిల్లలతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకొన్న ప్రధాని మోదీ (వీడియో)
రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 1:30 PM IST
పిల్లలతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకొన్న ప్రధాని మోదీ (వీడియో)
దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. పట్టణాల నుంచి ప్రజలు ఇప్పటికే గ్రామాలకు వెళ్లిపోయారు. అయితే.. తాజాగా రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు. చిన్నారులతో రాఖీ కట్టించుకుని వారితో సమయాన్ని గడిపారు.
ఢిల్లీ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లారు. పలువురు చిన్నారులు ప్రధాని మోదీకి రాఖీలు కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ.. చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీ రక్షాబంధన్ కట్టారు. మోదీ తన తల్లి వద్ద కూర్చొని ఉన్న ఫోటోతో ప్రత్యేకంగా తయారు చేసిన రాఖీని ప్రధానికి ఒక చిన్నారి ప్రత్యేకంగా కట్టింది. దాన్ని చూసిన మోదీ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా రాఖీలు కట్టిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీ వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అయితే.. రాఖీలు కడుతున్న సమయంలోనే ఆ విద్యార్థినుల పేర్లు.. ఏ తరగతి చదువుతున్నారనేది ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా – తమ్ముళ్లు, అన్నా – చెల్లెళ్ల మధ్య అవినాభావ సంబంధాలకు, అపారమైన ప్రేమకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఈ పవిత్ర పండుగ ప్రజల జీవితాల్లో ఆప్యాయతలను, సామరస్య భావాలను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తూ.. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Delhi: రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు. చిన్నారులతో రాఖీ కట్టించుకుని వారితో సమయాన్ని గడిపారు. pic.twitter.com/eMthd2Psu7
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 19, 2024