ఆర్బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం పడింది: ప్రధాని
ఉద్యోగాల కల్పనపై ఇటీవల ఆర్బీఐ నివేదిక విడుదల చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 July 2024 6:43 AM ISTఆర్బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం పడింది: ప్రధాని
ఉద్యోగాల కల్పనపై ఇటీవల ఆర్బీఐ నివేదిక విడుదల చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దాంతో.. నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం పడినట్లు అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
ఆర్బీఐ నివేదిక ప్రకారం గత నాలుగు ఏళ్లలో దేశంలో దాదాపు 8 కోట్ల కొత్త ఉద్యోగాలను కల్పించామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ గణాంకాలు చూసిన తర్వాత ప్రతిపక్షాలు నోటికి తాళం పడుతుందన్నారు. దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలను ప్రజల ముందు నిలబెట్టిందన్నారు. ఇకనైన అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే ముంబైలోని అటల్ సేతు వంతెన విషయంలో ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంతెనపై ఫేక్ ప్రచారం చేయడం వల్ల వారికి ఏం ఒరుగుతుందో తెలియడం లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలన్నారు. అటల్ సేతు వంతెనపై ప్రతిరోజు 20వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున ఇంధన ఆదా జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లించారు.