వరల్డ్‌లోనే ఎత్తైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

రల్డ్‌లోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 1:30 PM IST
prime minister modi, inaugurate, sela tunnel,

వరల్డ్‌లోనే ఎత్తైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

వరల్డ్‌లోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. డబుల్‌ లేన్‌ ఆల్‌ వెదర్‌ టన్నెల్‌ను ప్రధాని మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దీనికి సేలా టన్నెల్‌గా నామకరణం చేశారు. ఆ తర్వాత టన్నెల్‌ను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధిన నరేంద్ర మోదీ గత కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాటు పాలించిందనీ.. కానీదేశానికి చేసిందేమీ లేదంటూ మండిపడ్డారు.

భారత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారెంటీ ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించబోతుందని దీమాగా చెప్పారు. ఇక్కడి ప్రజలను.. అబివృద్ధి పనులను చూస్తేనే అర్థమైపోతుందని ప్రధాని చెప్పారు. ఎన్నికలోలో విజయం కోసం తాను పనిచేయననీ.. ప్రజల కోసమే తాను పనిచేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. 70 ఏళ్ల యూపీఏ పాలనలో జరగని అభివృద్ధిని.. తాను పదేళ్లలోనే చేసి చూపించానని అన్నారు. అష్ట లక్ష్మి పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాల్లో రూ.55వేల పనులు ప్రారంబించడం ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

సేలా టన్నెల్‌ ప్రత్యేకతలు:

* సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా బాలిపారా-చారిదౌర్-తవాండ్‌ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.

* రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది సరిహద్దుల రహదారుల సంస్థ. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలూ ఉన్నాయి. ఈ టన్నెల్‌ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. టన్నెల్‌-1 సింగిల్‌ ట్యూబ్‌తో 980 మీటర్ల పొడవుండగా.. టన్నెల్‌-2 ట్విన్‌ ట్యూబులతో 1,555 మీటర్ల పొడవు కలిగి ఉంది.

* భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు సేలా టన్నెల్‌ ఉపయోగకరంగా ఉంటుంది. అంఏతకాదు.. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని ఈ టన్నెల్‌ ఏకూర్చనుంది.

* టన్నెల్‌ అందుబాటులోకి రావడం ద్వారా తవాంగ్-దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

Next Story