బాల్యాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.

By Srikanth Gundamalla
Published on : 19 Jan 2024 4:04 PM IST

prime minister, modi, emotional,

 బాల్యాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. లబ్ధిదారులకు పీఎం ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద ఇళ్లు అందజేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ప్రధాని మోదీ 90వేల మంది నిరుపేదలకు పీఎం ఆవాస్‌ కింద ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇళ్లు పంపిణీ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. లబ్ధిదారులకు అందజేసిన ఇళ్లను చూస్తే తనకు ఒకటి గుర్తొచ్చిందని చెప్పారు. చిన్నతనంలో తనకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండు అనిపించిందనిఅన్నారు. అయితే.. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఇళ్లను అందివ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇళ్లు పంపిణీ చేయడం తనకు సంతృప్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇంత మంది సొంతి కల సాకారం అయ్యిందని చెప్పారు. ఇక ప్రజల ఆశీర్వాదాలే తనకు పెద్ద ఆస్తి అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉందని చెప్పారు ప్రధాని మోదీ. అణగారిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. దీనికి ఉదాహరణ ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే అని చెప్పారు. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేయడమే అని ప్రధాని చెప్పారు. పీఎం అర్బన్ స్కీమ్‌ కింద సోలాపూర్‌లో చేపట్టిన రాయ్‌ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు అని ప్రధాని మోదీ చెప్పారు.


Next Story