నియామక ప్రక్రియను సకాలంలో పూర్తి చేస్తున్నాం: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ సోమవారం 'రోజ్‌గార్ మేళా' కింద ఉద్యోగాలు పొందిన లక్షమందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 3:24 PM ISTనియామక ప్రక్రియను సకాలంలో పూర్తి చేస్తున్నాం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం 'రోజ్‌గార్ మేళా' కింద ఉద్యోగాలు పొందిన లక్షమందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. నియామక ప్రక్రియలను ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శకంగా మార్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నియామక ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తోందని చెప్పారు. దాంతో.. ప్రతి అభ్యర్థి తమ తమ సామర్థ్యాలను ప్రదర్శించేలా సమాన అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అభ్యర్థి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి అపాయింట్‌మెంట్ లేఖను అందుకునే వరకూ ఉన్న సమయాన్ని కుదించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
గత ప్రభుత్వాలు నియాక ప్రక్రియల్లో జాప్యం చేసేవని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దాంతో అవి సుదీర్ఘంగా సాగేవని అన్నారు. ఈ సమయంలో లంచాల వసూళ్లు వంటివి జోరుగా చోటు చేసుకునేవని చెప్పారు మోదీ. కానీ ఎన్డీఏ ప్రభుత్వం నియామకాలను పారదర్శకంగా చేపడుతోందని చెప్పారు. దేశానికి యువత సేవ చేసేలా 2014 నుంచి వారికి సహకరించాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగిదీ కీలక పాత్రే అని చెప్పారు. నేడు కొత్తగా చేరుతున్న లక్ష మంది ఉద్యోగుల నూతన శక్తిని అందిస్తారని అన్నారు. ఉద్యోగులు ఏ శాఖలో చేరారు అనేది ముఖ్యం కాదనీ.. దేశానికి అంకిత భావంతో సేవ చేయడం కీలకమన్నారు మోదీ. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ పదేళ్లలో 1.5 రెట్లు అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని ప్రధాని మోదీ చెప్పారు.