ప్రజలంతా ఈనెల 22న ఇళ్లలో జ్యోతిని వెలిగించాలి: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షోలాపూర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  19 Jan 2024 8:00 AM GMT
prime minister, modi, ayodhya, ram mandir,

ప్రజలంతా ఈనెల 22న ఇళ్లలో జ్యోతిని వెలిగించాలి: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షోలాపూర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. అయోధ్యలో ఈ నెల 22న రామాలయం ప్రారంభోత్సవ వేడుకల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రజలంతా తమతమ ఇళ్లలో జ్యోతిని వెలిగించాలనీ.. రామజ్యోతితో తమ జీవితాల్లో పేదరికం తొలగిపోయేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశంలో ఎన్నో ఏళ్ల కిందటే గరీబీ హఠావో నినాదాలు వినిపించినా పేదరికం మాత్రం పోలేదని ప్రధాని మోదీ అన్నారు.

అయోధ్యలో దివ్యభవ్య రామాలయ నిర్మాణంతో భక్తుల చిరకాల వాంఛ నెరవేరిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టతో దశాబ్దాల పాటు అనుభవించిన వేదన సమసిపోయిందని అన్నారు. గతంలో భక్తులు టెంట్‌ నుంచి రామ్‌లల్లా దర్శనం చేసుకునేవారు అని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.

రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా శుక్‌రవారం షేర్ ఏశారు. ప్లేలిస్ట్‌తో పాటు .. రామాయణం సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచచిందని చెప్పారు. భజన కీర్తలనలకు సంబంధించిన వీడియో లింక్స్‌ను కూడా ప్రదాని నరేంద్ర మోదీ షేర్ చేశారు.

కాగా.. ఈ నెల 22న మధ్యాహ్నం అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం జరుగుతుంది.


Next Story