మార్కెట్లోకి 2-DG డ్రగ్.. ధర ఎంతంటే..

Price of DRDO's 2DG anti-COVID-19 drug fixed at Rs 990. కరోనా రోగులును సైతం కోలుకొనేలా చేస్తున్న 2-DG ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది.

By Medi Samrat  Published on  28 May 2021 10:00 AM GMT
DRDOs 2DG anti-COVID-19 drug

ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్న కరోనా రోగులును సైతం కోలుకొనేలా చేస్తున్న 2-DG ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. ఆర్ డి ఓ డెవలప్ చేసిన ఈ మందు కోవిడ్ చికిత్సలో గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. పౌడర్ రూపంలో లభించ్చే ఈ మందుఒక్కో సాచెట్‌ ధర రూ. 990గా నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలియ చేసింది. 2-డీజీ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు తెలిపింది. అయితే ఆ డిస్కౌంట్ ఎంత వరకు ఉంటుందన్నది ఇంకా వెల్లడించలేదు.

2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసింది. ఈ మందు కరోనా రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితులను తగ్గిస్తుంది. పొడి రూపంలో ఉండే 2- డీజీ మందును నీటిలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ వివరించింది. ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ కొన్ని రోజుల క్రితమే ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని అనుమతులు ఇచ్చింది. మే 17న తొలి విడత కింద 10వేల 2-డీజీ సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది.


Next Story
Share it