రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ విజయవంతం

President Kovind's bypass surgery. ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బైపాస్‌ సర్జరీ విజయవంతమైంది.

By Medi Samrat  Published on  30 March 2021 12:11 PM GMT
Ramnath Kovinds bypass surgery successful

ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బైపాస్‌ సర్జరీ విజయవంతమైంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో మంగ‌ళ‌వారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్‌ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర‌ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్‌ సర్జరీ జరిగినట్లు తెలిపారు.

రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఎయిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్ల‌డించారు. ఆపరేషన్‌ విజయవంతంపై వైద్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ఆరోగ్యం కోసం, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిద్దామని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఇటీవ‌ల‌ ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన రాష్ట్రపతిని.. సిబ్బంది వెంటనే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వ‌హించిన‌ అనంతరం ఆయ‌న‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.


Next Story
Share it