జూన్ 9న మోదీ ప్రమాణస్వీకారం
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్
By Medi Samrat Published on 7 Jun 2024 7:00 PM ISTబీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఏ) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. జూన్ 9 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నరేంద్ర మోదీ.. తనను ప్రధానమంత్రిగా నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము తనకు లేఖ ఇచ్చారని, ప్రమాణ స్వీకారోత్సవానికి అనుకూలమైన సమయానికి సంబంధించిన వివరాలను కోరారని చెప్పారు. తనతో ప్రమాణ స్వీకారం చేసేందుకు మంత్రుల జాబితాను కూడా ఆమె కోరినట్లు మోదీ తెలిపారు. జూన్ 9వ తేదీ సాయంత్రం ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉంటామని ముర్ముకు చెప్పానన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించిన నేపథ్యంలో, నరేంద్ర మోదీ ఈ నెల 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Next Story