RepublicDay: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.

By అంజి
Published on : 26 Jan 2025 5:22 AM

President Droupadi Murmu, National Flag, Kartavya Path, RepublicDay

RepublicDay: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో హాజరయ్యారు. వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కఢ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

Next Story